Priyanka Tare: ఎస్కే మిసెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ విజేతగా ప్రియాంక తారే
హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంక తారే (Priyanka Tare) ప్రతిష్టాత్మక ఎస్కే మిసెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ 2025 విజేతగా నిలిచింది. దీనితో పాటు మిసెస్ ఇండియా తెలంగాణ (Mrs. India Telangana) 2025, సీజన్ -27 టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయ ప్రస్థానంలో ఆమె పియు ప్రొడక్షన్ (PU Production) కు బ్రాండ్ అంబాసిడర్గా ప్రతిష్టాత్మక హోదాతో మరింత గౌరవాన్ని అందుకుంది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) భిలాయ్కి చెందిన ఆమె ఉద్యోగరీత్యా కొన్నేళ్లుగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో స్థిరపడ్డారు.







