Hyderabad: హైదరాబాద్‌లో హైఅలర్ట్ … బస్టాండ్, రైల్వే స్టేషన్లలో
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad)లో హైఅలర్ట్ కొనసాగుతోంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport) లో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మతపరమైన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్‌లోనూ సోదాలు జరుగుతున్నాయి. అనుమానస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిటీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోటల్స్‌పై పోలీసులు (Police) నిఘా పెంచారు.
దేశంలో ఎక్కడ, ఏ ప్రాంతంలో పేలుళ్లు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్‌లో ఉండటం తీవ్ర కలకలం రేపుతున్న విషయం. ఎన్ఐఏ, వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు రాష్ట్రంలో తనిఖీలు చేయగా, అనుమానిత వ్యక్తులు పట్టుబడటం ఆదోళన కలిగిస్తోంది. ఇటీవల రాజేంద్రనగర్‌లో ఉగ్రవాద ఆరోపణలతో డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత అర్ధరాత్రి సయ్యద్ ఇంట్లో సోదాలు జరిపిన గుజరాత్ పోలీసులు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.







