High Court :బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి

బీఆర్‌ఎస్ రైతు మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు (High Court) అనుమతిచ్చింది. ఈ నెల 28న నల్గొండ (Nalgonda )క్లాక్‌టవర్ సెంటర్‌లో రైతు మహాధర్నా నిర్వహించాలని బీఆర్‌ఎస్ (BRS) నిర్ణయించింది. పోలీసు అధికారులు అనుమతి మ ంజూరు చేయకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా కార్యక్రమానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహా ధర్నాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)తో పాటు పలవురు ముఖ్య నేతలు, రైతులు పాల్గొననున్నారు.