Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy ) దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. ఇప్పటి వరకు కోర్టు నుంచి తమకు నోటీసులు (Notices) రాలేదని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రతివాదుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి (Assembly Secretary) సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణ ఈనెల 25కు వాయిదా వేసిన ధర్మాసనం, 25లోపు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.