Supreme Court: తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తాం : సుప్రీంకోర్టు

కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో మరోసారి విచారణ జరిగింది. వాదనల సందర్భంగా భూముల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) తెలిపారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. అదే సందర్భంలో పర్యావరణ పరిరక్షణను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తే, గతంలో చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తామన్నారు. సమగ్ర ప్రణాళికల తయారు చేసి కోర్టుకు అందించేందుకు తమకు ఆరు వారాలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకే సీజేఐ ధర్మాసనం అంగీకరించింది.