Harish Rao: కాంగ్రెస్ సర్కారు చూపంతా కమీషన్ల మీదే: హరీష్ రావు

తెలంగాణలో బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు సచివాలయంలోని సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ కమిషనర్ కార్యాలయాలను ముట్టడించిన ఘటనపై ఆయన (Harish Rao) స్పందించారు. ఈ ప్రభుత్వానికి కమీషన్లపై మాత్రమే దృష్టి ఉందని, ఏమాత్రం విజన్ లేదని హరీష్ రావు విమర్శించారు. గత రెండు నెలల కాలంలోనే కాంట్రాక్టర్లు బిల్లుల కోసం రెండుసార్లు సచివాలయం ముందు ధర్నా చేయడం దేశంలో ఇదే తొలిసారని ఆయన (Harish Rao) అన్నారు. గతంలో ఆర్థిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడించిన కాంట్రాక్టర్లు, ఇప్పుడు మళ్లీ ఆర్థిక శాఖ కార్యాలయం ముందు మెరుపు ధర్నా చేశారని గుర్తుచేశారు. బిల్లుల చెల్లింపులో నిజాయితీ పాటించకుండా, కమీషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా? లేక స్కాంగ్రెస్ ప్రభుత్వమా? అని ప్రశ్నించిన ఆయన (Harish Rao).. ఈ ప్రభుత్వానికి మిషన్ లేదు, విజన్ లేదని, కేవలం ‘కమీషన్లు’ మాత్రమే టార్గెట్‌గా పెట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే ప్రజలు ఏకమై నిలదీస్తారని హెచ్చరించారు.