రైతుల రుణమాఫీ పై హరీష్ రావు బహిరంగ లేఖ..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోజుకు ఒక రచ్చ కామన్ అయిపోయింది. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు రైతుల రుణమాఫీ గురించి బహిరంగ లేఖ రాశారు. రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఆయన ఈ నేపథ్యం గా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తాము అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన మరొకసారి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా డిసెంబర్ 9న రైతులకు ఎటువంటి రుణమాఫీ జరగలేదు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఇంకా ఒక్క రైతు ఖాతాలో కూడా రుణమాఫీ అందిన దాఖలాలు లేవు. మరి దీన్ని ఏ విధంగా అమలు చేస్తారు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పాలి. సాగునీరు, ఉచితంగా 24 గంటలు విద్యుత్తు రైతులకు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు అన్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల వేధింపులు తట్టుకోలేక రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని హరీష్ రావు అన్నారు. పంటకు మద్దతు ధరపై 500 బోనస్ గా ఇవ్వడంతో పాటు ఎకరానికి 15000 చొప్పున పెట్టుబడికి కూడా సాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు రాసిన ఈ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.