Supreme Court: సుప్రీంకోర్టులో హరీశ్ రావు కు ఊరట
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కు ఊరట లభించింది. హరీశ్‌రావు, మాజీ డీజీపీ రాధాకిషన్‌రావు (Radhakrishna Rao)లపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. వారిద్దరికీ వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీవీ నాగరత్న(BV Nagarathna) ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో హరీశ్, రాధాకిషన్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు (High Court) క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.






