Harish Rao: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు : హరీశ్ రావు
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma) అనుమతించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. కేటీఆర్ (KTR) పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలను వేధించడమే సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారు. స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చిల్లర డ్రామాలు చేస్తున్నారు. కేటీఆర్‌కు అండగా ఉంటాం అని అన్నారు.






