గ్రాన్యుల్స్ ఇండియా రూ.8 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ ఔషధ తయారీ సంస్థ గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ కరోనా పరిస్థితుల్లో ఉపకరిస్తాయని రూ.8 కోట్ల విలువైన 16 కోట్ల పారాసెటమాల్ మాత్రలను ప్రభుత్వానికి విరాళంగా ప్రకటించింది. ప్రతీవారం కోటీ చొప్పున వచ్చే నాలుగు నెలల్లో 16 కోట్ల మాత్రలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఉమాదేవి తెలిపారు. భారత్‍తో పాటు విదేశాల్లో కలిసి ఏడు కేంద్రాల్లో ఔషధాలను ఉత్పత్తి చేస్తున్న తమ సంస్థ కార్పొరేటు సామాజిక బాధ్యత కింద ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సంస్థ కార్యనిర్వాహక సంచాలకురాలు ఉమాదేవి చిగురుపాటి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్ష చిగురుపాటి బీఆర్‍కే భవన్‍లో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావును కలిసి ఈ సాయానికి సంబంధించిన లేఖను అందజేశారు.