ఘనంగా ముగిసిన ట్రెడా ప్రాపర్టీ షో

మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రెడా 9వ ప్రాపర్టీ షో 2018 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ట్రెడా అధ్యక్షులు పి.రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రియల్ వ్యాపారం అద్భుతంగా ఉందన్నారు. గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు ప్లాట్స్, విల్లాస్స్, అపార్టుమెంట్స్ కొనుగోలు దారులతో పాటు రియల్ వ్యాపారులతో అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రాంలో నైనా హెచ్ తగ్గులు ఉంటాయి కాని హైదరాబాద్‌లో ఎలాంటి హెచ్ తగ్గులు లేకుండా నిలకడగానే రియల్ రంగం అభివృద్ధి వైపు దూసుకుపోతుందన్నారు.