క్రెడాయ్ ప్రాపర్టీ షో విజయవంతం

వరంగల్‌లో ఇటీవల నిర్వహించిన క్రెడాయ్ ప్రప్రథమ ప్రాపర్టీ షో విజయవంతం అయ్యిందని క్రెడాయ్ తెలంగాణ కార్యదర్శి ప్రేమ్ సాగర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌లో మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో సందర్శకులు విచ్చేసిన ప్రాపర్టీ షో తమదేనని గర్వంగా చెప్పారు. రెండు రోజుల్లో ఎంతలేదన్నా పది వేలకు పైగా ప్రజలు విచ్చేసి తమకు కావాల్సిన ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాస వివరాలను తెలుసుకున్నారని చెప్పారు. తమ మొదటి షో విజయవంతం కావడంతో, తదుపరి ప్రాపర్టీ షోలను ఇతర నగరాల్లో నిర్వహించేందుకు క్రెడాయ్ తెలంగాణ ప్రణాళికల్ని రచిస్తుందని తెలిపారు.