Goldloan ATM : దేశంలోనే తొలి గోల్డ్‌లోన్ ఏటీఎం ప్రారంభం

వరంగల్ నగరంలో గోల్డ్‌లోన్ ఏటీఎం ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తవాడలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్(ఆధునికీకరణ)ను మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎంవీరావు (M.V. Rao) ముఖ్య అతితిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా వరంగల్ ఏఐ (Warangal AI) ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో రూపొందించిన గోల్డ్‌లోన్ ఏటీఎం (Goldloan ATM ) యంత్రాన్ని ప్రారంభించామన్నారు. కేవలం 10 నుంచి 12 నిమిషాల్లోనే ఆధార్ కార్డు (Aadhar card), మొబైల్ నంబరు (mobile number) ఆధారంగా ఏటీఎం సాయంతో గోల్డ్‌లోన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. బంగారు ఆభరణాలు మిషన్‌లోని బాక్సులో వేస్తే నాణ్యత, బరువును ఏఐ సాంకేతకత ద్వారా గుర్తించి ఆరోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు ఉంటాయన్నారు. 10 శాతం డబ్బులు ఏటీఎం ద్వారా వస్తాయని, మిగతా నగదు ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులై ఉండాలని చెప్పారు. ఈ యంత్రం వల్ల బ్యాంకు సిబ్బందికి, ఖాతాదారుడికి సమయం ఆదా అవుతుందన్నారు. ఇది విజయవంతమైతే దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.