3 నుంచి గ్లోబల్ సౌత్ కాన్ఫరెన్స్

యాంటీ బయాటిక్స్ విచ్చలవిడి వాడకంతో ప్రమాదకరస్థాయికి చేరుకున్న యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) నియంత్రణపై హైదరాబాద్‌లో అక్టోబరు 3 నుంచి 5 వరకు గ్లోబల్ సౌత్ కాన్ఫరెన్స్ జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయని సదస్సు ప్రతినిధులు డాక్టర్ రంగారెడ్డి బుర్రి, ఆర్.గోవింద్‌హరి మీడియా సమావేశంలో తెలిపారు.