High Court :తెలంగాణ హైకోర్టులో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు (High Court )కు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు (Judges) ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ రేణుకా యారా, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ ఇ.తిరుమలదేవి, జస్టిస్ బి.ఆర్. మధుసూదన్‌రావుతో హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్(Sujay Paul) ప్రమాణం చేయించారు. ఇంతకుముందు రేణుకా యారా సిటీ సివిల్ కోర్టు (City Civil Court) చీఫ్ జడ్జిగా, నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా, ఇ.తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, విజిలెన్స్, రిజిస్ట్రార్‌గా, బి.ఆర్. మధుసూదన్‌రావు (B.R. Madhusudhan Rao) హైకోర్టు రిజిస్ట్రార్ ( పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తించారు. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం 26 మంది సేవలందిస్తున్నారు. ఈ నలుగురి నియామకంతో ఆ సంఖ్య 30కి చేరింది.