Magam :మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి ఇకలేరు

మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి (MLC Magam Ranga Reddy) కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శామీర్‌పేట (Shamirpet) లో రంగారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) కి ఆయన సన్నిహితులుగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి ఒకసారి ఎమ్మెల్సీ (MLC) గా ఎన్నికయ్యారు. రంగారెడ్డి మృతిపట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.