MLC : తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ(MLC) స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్(Addanki Dayakar), విజయశాంతి(Vijayashanti) , శంకర్ నాయక్(Shankar Nayak), బీఆర్‌ఎస్ నుంచి దాసోజ్ శ్రవణ్(Dasoj Shravan), సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం(Nellikanti Satyam) ఎన్నికయ్యారు. వీరు కాకుండా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.