Ponnam Prabhakar: అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ గెలుపే అందరి లక్ష్యం: పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని, ఇందుకోసం పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwara Rao) పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వారు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇన్ఛార్జులు, ఇతర కీలక నేతలతో మంత్రులు సమావేశమయ్యారు. డివిజన్లోని నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఎర్రగడ్డ డివిజన్లో బూత్ కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశించారు. స్థానిక ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాము అందుబాటులో ఉంటామని, బూత్ స్థాయిలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని వారు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తే అది రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం అవుతుందని తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwara Rao), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పేర్కొన్నారు.







