Etela Rajender: ఆ మహనీయుడి ఆశయాలను అమలు చేయాలి : ఈటల

రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధాని నరేంద్ర మోదీ సమున్నతంగా కాపాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela rajender) అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించిన అనంతరం ఈటల మాట్లాడారు. ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద, సమస్త ప్రజల అవసరాలను తీర్చాలని చెప్పిన మహనీయుడు అంబేడ్కర్ (Ambedkar) అని కొనియాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పారన్నారు. వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి ఆశయాలను గుర్తు చేసుకొని అమలు చేయాడనికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తోంది. ప్రజలకు ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏం సాధించారని అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. హోదా, స్థాయి మరిచి ఆయన చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డికి డీఎన్‌ఏ పరీక్ష జరగాలన్న వ్యాఖ్యలకు శిక్ష తప్పదు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఖండిస్తూ నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) హాజరవుతారు అని తెలిపారు.