యూఏఈలో ఉద్యోగాలకు డ్రైవ్

గల్ఫ్ దేశాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, బీఎంఎస్ ఆపరేటర్, ఎంఈపీ టెక్నీషియన్, ఎంఈపీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 27, 28వ తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు టామ్‌కామ్ ప్రకటనలో తెలిపింది. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులై, కనీసం 2 నుంచి 4 ఏండ్ల మధ్య అనుభవం, 20 `40 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు www.tomcom.telangana.gov.in కి రెజ్యూమ్ పంపాలని కోరారు.