Narendra Kumar :తెలంగాణ వైద్య విద్యా సంచాలకుడిగా డాక్టర్ నరేంద్ర కుమార్

తెలంగాణ వైద్య విద్యా సంచాలకుడిగా (డీఎంఈ)గా డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ (Narendra Kumar) నియమితులయ్యారు. 2014 నుంచి ఇప్పటివరకు ఇంఛార్జి డీఎంఈలే ఉండగా, రాష్ట్రంలో తొలి రెగ్యులర్ డీఎంఈగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ (Christina Zed) ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ నరేంద్ర కుమార్ ప్రస్తుతం ఉస్మానియా వైద్య కళాశాల (Osmania Medical College) ప్రిన్సిపల్, అదనపు డీఎంఈగా కొనసాగుతున్నారు. ఉస్మానియా వైద్య కళాశాల, గాంధీ వైద్య కళాశాల (Gandhi Medical College), ఏపీ ఛాతీ ఆసుపత్రి, కాకతీయ వైద్య కళాశాల (వరంగల్)లో చిన్నపిల్లల సర్జన్‌గా, వైద్య బోధకుడిగా సేవలందించిన ఆయన, 2021లో
ఉస్మానియా వైద్య కళాశాల ప్రొఫెసర్‌గా, పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. డీఎంఈగా నియమితులైన నరేంద్ర కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ అభినందనలు తెలిపింది. ఆయన సారథ్యంలో తెలంగాణ వైద్య విద్య కొత్త శిఖరాలను చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది.