Ambujnath Bose Award: డా. నాగేశ్వరెడ్డికి అంబుజ్నాథ్బోస్ పురస్కారం
లండన్లోని ప్రతిష్ఠాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ (ఆర్సీపీ) ఆధ్వర్యంలో అత్యుత్తమ పరిశోధనలకు ఏటా అందించే ప్రముఖ వైద్యవేత్త అంబుజ్నాథ్బోస్ పురస్కారాన్ని (Ambujnath Bose Award) 2025 సంవత్సరానికి ప్రముఖ వైద్యులు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి (Dr. Nageswara Reddy) కి ప్రదానం చేశారు. ఎండోస్కోపీలో డాక్టర్ నాగేశ్వరెడ్డి చేసిన పరిశోధనలు, కృషిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అవార్డుకు ఎంపిక చేశారు. 1998లో డాక్టర్ సి.గోపాలన్ (Dr. C. Gopalan) తర్వాత అంబుజ్నాథ్ బోస్ పురస్కారం తెలుగు వైద్యులు నాగేశ్వరరెడ్డికి దక్కడం గొప్ప విశేషమని ఏఐజీ (AIG) ఒక ప్రకటనతో తెలిపింది.







