గవర్నర్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్నందున తెలంగాణ కొత్త గవర్నర్‌గా వచ్చిన రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అమలు చేస్తున్న పథకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసి ఆరు గ్యారెంటీలను, వాటి విశిష్టతను, లబ్ధి పొందుతున్న వారి వివరాలను వెల్లడించారు.