తెలంగాణలో దైకి యాక్సిస్ ప్లాంట్?
నీటి శుద్ధి పరిష్కారాల సంస్థ దైకి యాక్సిస్ జపాన్ దేశీయంగా దక్షిణాది రాష్ట్రాల్లో మూడో ప్లాంటు నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హరియాణాలో ఏడాదికి 1000 మురుగు నీటి శుద్ధి యూనిట్లు తయారు చేయగల ప్లాంటును రూ.200 కోట్లతో నిర్మిస్తున్నట్లు దైకి యాక్సిస్ ఇండియా సీఈవో కమల్ తివారీ చెప్పారు. ఇది అక్టోబరులో కార్యకలాపాలు ప్రారంభిస్తుందన్నారు. ఇప్పటికే గుజరాత్లో ఒక ప్లాంట్ ఉంది. మూడో ప్లాంటును దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో నెలకొల్పేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఇంటి వాడుక నీటిని పునర్వినియోగానికి స్థిం చేసే పరికరాలను తయారు చేస్తారు.






