క్రెడాయ్ తెలంగాణ కొత్త కార్యవర్గం ఎన్నిక

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చాప్టర్‌కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఆర్వీ నిర్మాణ్ ఎండీ సీహెచ్. రామచంద్రారెడ్డి కొత్త ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. చైర్మన్‌గా గుమ్మి రాంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా డి.మురళీకృష్ణా రెడ్డి ఎంపిక కాగా.. సెట్రకరీగా ఈ ప్రేమ్‌సాగర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లుగా కె.ఇంద్రసేనా రెడ్డి, జి.అజయ్ కుమార్, సి.జగన్‌మోహన్, వి.మధుసూధన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా గోపాల్ పంచారియా, పి.రాజు, వై సైదేశ్వర్ రావులు, ట్రెజరర్‌గా బి.పాండురంగా రెడ్డి ఎన్నికయ్యారు. 2019-21 సంవత్సరానికి గాను వీళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.