క్రెడాయ్ హైదరాబాద్ నూతన కార్యవర్గం ఏర్పాటు

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. 2019-2021 సంవత్సరాలకు గాను కొత్త మేనేజ్‌మెంట్ కమిటీని నియమించినట్లు నూతన అధ్యక్షులు పి.రామకృష్ణారావు తెలిపారు. నలుగురు ఉపాధ్యక్షులుగా సీజీ మురళీ మోహన్, కంచం రాజేశ్వర్, వీ వేణు వినోద్, ఎన్ జయదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వీ రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారిగా ఆదిత్య గౌరా, సంయుక్త కార్యదర్శలుగా శివరాజ్ ఠాకూర్, కొత్తపల్లి రాంబాబు, కార్యవర్గ సభ్యులుగా బి ప్రదీప్ రెడ్డి, ఆర్ రాజశేఖర్ రెడ్డి, ఎం శ్రీకాంత్, టి శశికాంత్ రెడ్డి, ఎం సతీష్ కుమార్, జి నితీష్ రెడ్డి, జి దయాకర్, పి ఉపేందర్‌లు నియమితులుయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రామకృష్ణరావు మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల సంతృప్తి, ఈ రంగంలోని కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అత్యుత్తమంగా నిర్వహించడమే లక్ష్యాలుగా కొత్త కమిటీ పనిచేయనుందన్నారు.