Revanth Reddy :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం

దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కి ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. విమానాశ్రయంలోని పీటీబీ లాంజ్ (PTB Lounge )లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. అక్కడే కొద్దిసేపు ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ జూబ్లీహిల్స్ (Jubilee Hills)లోని తన నివాసానికి వెళ్లారు.