Supreme Court : స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచనలు మాత్రమే : అద్దంకి దయాకర్

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ అధికారాలను సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించలేదని, కేవలం సూచనలు మాత్రమే చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు. సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సభాహక్కులు కాపాడేది కేవలం స్పీకర్ (Speaker) మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు. తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ బీఆర్‌ఎస్ నాయకులు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నాయకులు ముందు సుప్రీంకోర్టు తీర్పును చదవాలి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలను తమ పార్టీలో విలీనం చేస్తున్న చరిత్ర కేసీఆర్ (KCR) ది. అధికారంలో ఉన్న పదేళ్లు భారత రాష్ట్ర సమితి తుంగలో తొక్కింది. సీఎల్పీ నేతగా ఒక దళిత నేత ఉంటే సహించలేక కేసీఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీల అంతం చూడాలని కేసీఆర్ ప్రయత్నించారు. మేం ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని బతికించాం. ప్రతిపక్ష హోదా ఉన్నా అసెంబ్లీకి రాని కేసీఆర్‌పై మేం కోర్టుకు వెళ్లాలా? కేసీఆర్ అసెంబ్లీ (Assembly) కి రాకపోవడంపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అని అన్నారు.