Mahesh Kumar :రిజర్వేషన్ల పెంపు తర్వాతే.. స్థానిక సంస్థల ఎన్నికలు : మహేశ్ కుమార్ గౌడ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) (GHMC)ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేడయం ఖాయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ మాట్లాడుతూ కులగణన నివేదికపై ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee) సమవేశం నిర్వహిస్తామన్నారు. రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే అంశంపై స్పందించిన ఆయన.. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగానే కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదన్నారు. ఎమ్మెల్సీ (MLC)ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్ఠానం వద్దకు పంపించామని తెలిపారు.






