Congress: జూబ్లీహిల్స్ హస్తగతం…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) అత్యధిక మెజారిటీ సాధించి విజయాన్ని అందుకున్నారు. తన సమీప ప్రత్యర్థి, బిఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచే నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ రౌండ్‌కూ అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్లోనూ %దీRూ% అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్‌రెడ్డి సర్కార్‌కు, కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహానిచ్చింది. భారత రాష్ట్ర సమితి, భాజపా అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. భాజపాకు డిపాజిట్ గల్లంతైంది.






