Cabinet: ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion)కు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) నుంచి అభిప్రాయాలు సేకరించింది. సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy), మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీలో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్‌కు, ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది. మైనారిటీలకు అవకాశమిస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.