CM Revnath Reddy: రాష్ట్రానికి మోదీ ఏమైనా ఇచ్చినా.. కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు: రేవంత్ రెడ్డి

వనపర్తిలో జరిగిన “ప్రజా పాలన-ప్రగతి బాట” బహిరంగ సభ వేదికగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revnath Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నప్పటికీ, కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారంటూ విమర్శించారు. వరంగల్ ఎయిర్ పోర్టును ప్రధాని మోదీ ఇచ్చారని, కానీ దీన్ని తానే తెచ్చినట్లు కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నాడని సీఎం రేవంత్ (CM Revnath Reddy) మండిపడ్డారు. “మరి మెట్రో రైలు ఎందుకు రాలేదు? మూసీ ప్రక్షాళనకు నిధులు ఎందుకు రాలేదు? వీటిని ఆపింది ఎవరు? ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం తన వల్లే మంజూరు అయిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు… మరి దక్షిణ భాగం ఎవరి వల్ల ఆగిపోయింది? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా… పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది… దీన్ని ఆపింది ఎవరు?” అని రేవంత్ రెడ్డి (CM Revnath Reddy) ప్రశ్నించారు. ‘ఏదైనా ప్రాజెక్టు వస్తేనేమో కిషన్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటాడు. ప్రాజెక్టు రాకపోతే రేవంత్ రెడ్డి వైఫల్యం అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. తన కంటే చిన్నవాడు సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపుమంట” అని రేవంత్ (CM Revnath Reddy) తీవ్రంగా విమర్శించారు.