Cabinet : కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టే : రేవంత్‌రెడ్డి

రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) అన్నారు. ఢల్లీి (Delhi) పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గం (Cabinet) లో ఎవరు ఉండాలో అదిష్ఠానానిదే తుది నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించట్లేదు. ప్రతిపక్ష నేతల (Leader of the Opposition)పై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తాం. త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయాలనే ఆలోచన లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కులగణన చేశాం అని సీఎం వివరించారు.