Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల అమలుకు మా వద్ద 3 మార్గాలు : సీఎం రేవంత్ రెడ్డి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం సాయంత్రం వరకు వేచి చూస్తాం. రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. ఆమె సమయం ఇవ్వలేదంటే ప్రధాని (Prime Minister) ఒత్తిడి చేసినట్టు భావించాల్సి ఉంటుంది. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఉన్న మార్గాలన్నింటిని ప్రయత్నించాం. కుదురనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాలి. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అమలుకు మా వద్ద 3 మార్గాలు ఉన్నాయి. 50 శాతం సీలింగ్‌పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలి. జీవో ఇస్తే ఎవరైనా కోర్టు (Court) కు వెళ్తే స్టే వస్తుంది. కాబట్టి జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే మొదటి మార్గం సాధ్యం కాదు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గం. స్థానిక ఎన్నికలు ఆపితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయి. కేంద్ర నిధులు రాకుంటే గ్రామాల్లో వ్యవస్థలు కుప్పకూలుతాయి. మూడో మార్గం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వడం. బీసీలకు 42 శాతం సీట్లపై ఇతర పార్టీలపైనా ఒత్తిడి తెస్తాం అని తెలిపారు.







