Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్ దేశంలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu), ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ (Jayesh Ranjan), ఇతర అధికారులు విదేశీ పర్యటనలో పాల్గొంటారు. అక్కడ సీఎం బృందం ఏయే కంపెనీల ప్రతినిధులతో సమావేశమవ్వాలనే ప్రణాళికను పరిశ్రమలశాఖ రూపొందించింది. జపాన్ (Japan) కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సమావేశమై, సీఎం పర్యటనలో ఒప్పందాలపై చర్చించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జపాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ ఏడాది జూన్-జులై నెలల్లో అమెరికా (America) నుంచి పెట్టుబడులను ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు తెలుస్తోంది.