Revanth Reddy : ప్రధాని మోదీని కలవడంలో రాజకీయం ఏముంది? : రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటన పేరుతో ఎలాంటి దుబారా చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) రాష్ట్రాల సీఎంలకు పెద్దన్న లాంటివారని, ఆయన్ను తాను కలవడంలో రాజకీయం ఏముందని ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడతాయని, అందువల్ల కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని కలిశానని పేర్కొన్నారు. ప్రధానిని గౌరవించే విజ్ఞత మాది. రాజకీయాలకు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ నేతను, ఆయన బీజేపీ నాయకుడు. అవసరమైతే మహేశ్వర్ రెడ్డిని ఢిల్లీ తీసుకెళ్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy )ని నాలుగు సార్లు కలిశాం. నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) , అమిత్ షా (Amit Shah) లను కూడా కలిశాం అని సీఎం వివరించారు.