Revanth Reddy:మహానీయుల స్ఫూర్తి తో తెలంగాణను ఆగ్రపథంలో : సీఎం రేవంత్ రెడ్డి

అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా గోల్కొండ కోట (Golconda Fort)లో జాతీయపతకాన్ని సీఎం ఆవిష్కరించారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని చెప్పారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ 1947 ఆగస్టు 15న నెహ్రూ (Nehru) చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందన్నారు. దేశ భవిష్యత్ మనల్ని పిలుస్తోందని నెహ్రూ చేసిన ప్రసంగం చిరస్మరణీయం. నెహ్రూ స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేం చేశారు. నాటి ప్రధాని నెహ్రూ కేవలం ప్రసంగాలతో సరిపెట్టలేదు. పటిస్ట భారత్ కోసం ఎన్నో చర్యలను చేపట్టారు. మహనీయుల స్ఫూర్తితో తెలంగాణ (Telangana)ను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాహసోపేత నిర్ణయాలతో సాగుతోంది. ప్రపంచ నగరాలతో పోటీపడే నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నాం. మరోవైపు పేదల సంక్షేమంలో సరికొత్త చరిత్ర రాస్తున్నాం. సంక్షేమానికి కేరాఫ్ అంటే కాంగ్రెస్(Congress) పాలన. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. సన్న బియ్యం పథకం కేవలం ఆకలితీర్చే పథకం కాదు. పేదల ఆత్మగౌరవానికి పత్రీక. ప్రజాప్రభుత్వం వచ్చేకే పేదల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. రేషన్‌షాపులు పేదవాడి ఆకలితీర్చే భరోసా కేంద్రాలుగా మరాయి అని అన్నారు.