Revanth Reddy : ప్రజా ప్రయోజనాలే ముఖ్యం : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగరంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలోని 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ఆయన పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల అనుసంధానం, ఆటంకాలు లేని రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అదనపు భూసేకరణ విషయంలో ఖర్చుకు వెనకాడవద్దని అన్నారు. ఈ సమీక్ష సలహాదారులు వేం నరేందర్ రెడ్డి (Narender Reddy), శ్రీనివాస్ రాజు, సీఎస్ శాంతి కుమారి (Shanti Kumari) , సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు వి.శేషాద్రి, చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.