Revanth Reddy :హైదరాబాద్‌కు మూడువైపులా స్టాక్ పాయింట్లు : సీఎం రేవంత్

ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) నుంచే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఖనిజాభివృద్ధి (Mineral development) శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. నిర్మాణరంగ సంస్థలకు అవసరమైన ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలి. సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదు. హైదరాబాద్ (Hyderabad)నగరానికి మూడు వైపులా స్టాక్ పాయింట్లు (Stock points) ఏర్పాటు చేయాలి. క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. మైనర్ ఖనిజాల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలి అని ఆదేశించారు.