Revanth Reddy :సింగపూర్ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి : సీఎం రేవంత్‌రెడ్డి

సింగపూర్ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అక్కడి నదిలో కాసేపు బోట్ రైడ్ చేశారు. సింగపూర్ (Singapore) జల సంరక్షణ చర్యలు బాగున్నాయని కొనియాడుతూ, ఆ తరహా హైదరాబాద్(Hyderabad)ను తీర్చిదిద్దాలంటూ ఎక్స్ లో రేవంత్ రెడ్డి పోస్టు చేశారు. నదిలో విహరిస్తూ పరిసరాలను పరిశీలించిన వీడియోను దానికి జత చేశారు. సింగపూర్‌లో జలవనరుల సంరక్షణ చర్యలను లోతుగా పరిశీలించా. వారసత్వ భవనాలను కాపాడుతూనే నదిని తీర్చిదిద్ది, చుట్టూ అత్యాధునిక నివాస భవన సముదాయాలు, కార్యాలయాలు, పట్టణ సౌకర్యాలను అభివృద్ధి చేశారు. హైదరబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు సింగపూర్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.