Rangarajan : అర్చకుడు రంగరాజన్ ఘటనపై .. స్పందించిన సీఎం రేవంత్

చిలుకూరి (Chilukuri) బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ (Rangarajan) పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల (Police) ను ఆదేశించారు.