Revanth Reddy: గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్టుదేవ్ వర్మ (Jishtudev Verma) తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గవర్నర్‌కు జ్ఞాపిక అందజేసి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) , సీఎం సలహాదారు వేం నరేంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ విడిగా సుమారు 15 నిమిషాలకు పైగా చర్చించారు. ఇందులో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై మాట్లాడినట్లు తెలిసింది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండడంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై గవర్నర్‌తో జరిపిన చర్చల్లో ప్రస్తావించినట్లు సమాచారం.