సీఎం రేవంత్‌ను కలిసిన బ్రిటీష్ హైకమిషనర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ మర్యాద పూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి లిండీ కామెరాన్ సహా వెంట ఉన్న బ్రిటన్ అధికారులను శాలువలతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాషీ తదితరులు ఉన్నారు.