Kishan Reddy: బీసీలకు జనాభా సేకరణ తర్వాతే సామాజిక న్యాయం : కిషన్ రెడ్డి

బీసీ జనాభా సేకరణను కాంగ్రెస్ గతంలో ఎందుకు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ మొర్చా మహాధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీల బీసీలను పీఎం, సీఎంలను చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలకు జనాభా సేకరణ తర్వాతే సామాజిక న్యాయం జరుగుతుంది. ఢల్లీిలో అనేక రకాలుగా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీసీల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.