Revanth Reddy: సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించనున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), భద్రాచలం దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao )ను కూడా రావాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి (Sri Ram Navami) బ్రహ్మోత్సవాల గోడపత్రికను సీఎం నివాసంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఆవిష్కరించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన వివరాలను అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ఆలయ ఈవో రమాదేవి (Ramadevi) ఉన్నారు.