Revanth Reddy: తానెవరో తెలియకుండానే పీసీసీ, సీఎం పదవులకు ఎంపిక చేస్తారా?

గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధముందని, ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. తానెవరో తెలియకూండానే పీసీసీ అధ్యక్షుడు(PCC President), సీఎం పదవులకు ఎంపిక చేస్తారా? అని ప్రశ్నించారు. ఎవరి ట్రాప్‌లోనూ తాను పడనన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar)కు కలిసేందుకు ఢిల్లీ చేరుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత కేసీఆర్(KCR) గవర్నర్ ప్రసంగానికి రావడం కాదని, అసెంబ్లీలో చర్చకు హాజరుకావాలన్నారు. డీలిమిటేషన్(Delimitation) , లిమిటేషన్ ఫర్ సౌత్ అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పట్టించుకోవడం లేదన్నారు. ఆయా అంశాలు సాధించుకురావాలనే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.