మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. జీవన్ రెడ్డి

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే జీవన రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బాబాయి మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం బీఆర్‌ఎస్ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. జీవన్ రెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రాం. ఎంఎస్‌ఎన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ తమపార్టీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఖరారు కావడంతో ఈ స్థానానికి పోటీ అనివార్యమైంది.