Osmania Hospital : ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్‌నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) భవనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha), ఇతర మంత్రులతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్‌గంజ్‌లో ఉండగా, నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2 వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం రానుంది.