ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలు సంపూర్ణం, మహేష్ బిగాల ని ప్రత్యేకంగా అభినందించిన సీఎం కెసిఆర్

మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారి పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు, ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ పీవీ కమిటీ సభ్యుడు మహేష్ బిగాల గారిని విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు అభినందించి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు, కరోనా ప్రపంచ దేశ విదేశాల్లో ఎన్నో అవాంతరాలు ఎదురైనా దెస విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.
పీవీ కమిటి చైర్మన్ కేశవ రావు గారు మాట్లాడుతూ దేశ విదేశాలలో 10 అంతర్జాతీయ వెబినార్ లో 50 దేశాలలో మీటింగ్స్ నిర్వహించిన దీని వెనక మహేష్ బిగాల గారి కృషి అమోఘం అని అన్నారు.
సీఎం కెసిఆర్ గారికి , కేశవ రావు గారికి ధన్యవాదాలు తెలిపిన మహేష్ బిగాల
పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపామని మహేష్ బిగాల ముగింపు ఉత్సవాల్లో సందర్బంగా చెప్పారు. దేశ విదేశాలలో వున్నా పీవీ అభిమానులని అందరిని ఏకం చేసారు అన్నారు. కరోనా వున్నా కోవిద్ నిబంధలని పాటిస్తూ వివిధ దేశాలలో ప్రతక్షంగా , జూమ్ లో పాల్గొనేలా చేసి శత జయంతి ఉత్సవాలను దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీపై పీవీ ఖ్యాతిని స్మరించుకోవడం, నేటి తరానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఉత్సవాలు నిర్వహించామని చెప్పారు. ఏడాది పాటు వివిధ దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పీవీ ఘనతపై చర్చించుకున్నామని అన్నారు. పీవీ కేవలం ఆర్థిక సంస్కరణలకు పరిమితం కాలేదని, ఏ రంగంలో బాధ్యత చేపట్టినా వినూత్న నిర్ణయాలు తీసుకునే నిరంతర సంస్కరణశీలి పీవీ అని కొనియాడారు.
ఈ సందర్బంగా పార్టీలకు అతీతంగా సహకారం అందించిన ప్రపంచ వ్యాప్తంగా వున్నా అన్ని ఎన్నారై సంఘాలకు మహేష్ బిగాల ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఉత్సవాల సందర్బంగా ప్రత్యేకంగా అభినందిన మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, సహకారం అందించిన కేశవ్ రావు గారికి, పీవీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.