Nandamuri Padmaja : నందమూరి పద్మజ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి

నందమూరి పద్మజ (Nandamuri Padmaja) భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాళులర్పించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ (Jayakrishna) సతీమణి పద్మజ అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని జయకృష్ణ నివాసానికి వెళ్లిన చంద్రబాబు పద్మజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. మా పెళ్లి విషయంలో జయకృష్ణ, పద్మజ పెద్ద దిక్కుగా ఉండి అన్నీ చూసుకున్నారు. ఇంట్లో అందరూ యంగ్‌స్టర్స్‌గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే కుటుంబ పెద్దగా అందరితో కలుపుకోలుగా ఉండేవారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందడం చాలా బాధేస్తోంది. అందరికంటే జయకృష్ణ గారికి తీరని లోటు. ఎన్టీఆర్ (NTR) కుటుంబంలో మొదట నాకు పరిచయం జయకృష్ణ గారితోనే. నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు , ఎగ్జిబిటర్‌గా ఆయన నా దగ్గరిక వచ్చే వారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారిని కలవడం, అవన్నీ జరిగాయి. అన్ని విషయాలు ముందుండి ఆలోచించింది జయకృష్ణే. ఆయన కుటుంబానికి అందరం అండగా ఉంటాం అని తెలిపారు. పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరావు (Daggubati Venkateswara Rao) కు సోదరి.